Mulugu: 52 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:24 AM
ఛత్తీస్‌గఢ్‌లో ని బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట శుక్రవారం 52 మంది మావోయిస్టులు లొంగిపోయా రు. వీరందరిపై సుమారు రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు
వీరందరిపై రూ.1.41 కోట్ల రివార్డు
ములుగు జిల్లాలో మరో ఇద్దరి లొంగుబాటు
చర్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో ని బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట శుక్రవారం 52 మంది మావోయిస్టులు లొంగిపోయా రు. వీరందరిపై సుమారు రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, ఏవోబీ, మహారాష్ట్ర ఏరియా కమిటీలో పని చేసిన మావోయిస్టులున్నారని చెప్పారు. తక్షణ సాయం కింద వీరికి 50 వేల చొప్పున నగదు అందజేశామన్నారు. ఇదిలాఉండగా మద్దేడు అడవుల్లో శుక్రవారం మావోయిస్టు పార్టీ డంప్‌ని బలగాలు గుర్తించాయి. మావోయిస్టు సామగ్రి, వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.