Share News

రాహుల్‌ ప్రధాని కావాలని 4500కి.మీ పాదయాత్ర

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:05 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో ఏపీలోని ఒంగోలు ప్రాంతానికి చెందిన హైకోర్టు అడ్వకేట్‌ కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర గురువారం సంగారెడ్డికి చేరుకుంది.

రాహుల్‌ ప్రధాని కావాలని 4500కి.మీ పాదయాత్ర
JAGGAREDDY

  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు పాదయాత్ర చేపట్టిన వెంకటేశ్వర్లును సంగారెడ్డిలో సన్మానిస్తున్న జగ్గారెడ్డి

  • సంగారెడ్డి చేరుకున్న వెంకటేశ్వర్లును

  • అభినందించిన జగ్గారెడ్డి

  • రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలని

  • ప్రజలందరూ కోరుకుంటున్నారు

  • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు

  • పాదయాత్ర.. గొప్ప విషయం

  • ప్రజలు సంతోషంగా ఉండాలంటే

  • రాహుల్‌ ప్రధాని కావాల్సిందే

  • పాదయాత్ర తర్వాత వెంకటేశ్వర్లును రాహుల్‌ వద్దకు తీసుకెళ్తా

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో ఏపీలోని ఒంగోలు ప్రాంతానికి చెందిన హైకోర్టు అడ్వకేట్‌ కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర గురువారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి.. ఆయనకు ఘన స్వాగతం పలికి వెంట నడిచారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేపట్టడం ఆషామాషీ విషయం కాదన్నారు. ఇప్పటికే 1,590 కిలోమీటర్లు నడిచారని, మొత్తంగా 4,500 కి.మీ. ఈ పాదయాత్ర సాగుతుందని వివరించారు. పాదయాత్రలో అడుగడుగునా రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు ప్రజలు చెప్పడం సంతోషకరమన్నారు. పాదయాత్ర పూర్తయిన వెంటనే వెంకటేశ్వర్లును స్వయంగా తానే రాహుల్‌గాంధీ దగ్గరకు తీసుకెళ్తానని వెల్లడించారు. రాహుల్‌గాంధీ కుటుంబం త్యాగాలకు ప్రతీక అని, రాహుల్‌ ప్రధాని అయితేనే దేశ ప్రజలు సంతోషంగా ఉంటారని జగ్గారెడ్డి ఆకాంక్షించారు.

Updated Date - Sep 18 , 2026 | 06:05 AM