Share News

ఈ దారి.. నరకానికి రహదారి

ABN , Publish Date - Oct 11 , 2026 | 11:33 PM

ఈ దారి.. నరకానికి రహదారి అన్న చందంగా ఆ దారి తయారయ్యింది.

ఈ దారి.. నరకానికి రహదారి
కంకర పరిచి వదిలేసిన పెద్దతండా రోడ్డు

- కంకరవేశారు.. బీటీ మరిచారు

- నాలుగేళ్లుగా పెద్దతండా వాసుల ఎదురుచూపులు

జడ్చర్ల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఈ దారి.. నరకానికి రహదారి అన్న చందంగా ఆ దారి తయారయ్యింది. బీటీ రోడ్డు నిర్మాణానికి కంకర పరిచారు. కానీ నిర్మాణం మరిచారు. దీంతో నాలుగేళ్లుగా ఆ పెద్దతండా వాసులు బీటీ కోసం ఎదురుచూస్తున్నారు. మండలంలోని బూర్గుపల్లి నుంచి పెద్దతండా వరకు సుమారు రెండు కిలో మీటర్ల రహదారిని బీటీగా మార్చేందుకు రూ.1.40 కోట్లు మంజూరయ్యాయి. 2022 డిసెంబరు 7న ట్రైబల్‌ వెల్ఫేర్‌ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తామంతా బీటీ రోడ్డుపై ప్రయాణం చేసి తండాకు చేరుకోవచ్చన్న తండావాసుల ఆశలు నేటికీ అడియాశలుగా మిగిలాయి. 2022 సంవత్సరంలో నిధులు మంజూరీ కాగా, సంవత్సరం తర్వాత పనులకు శంఖుస్థాపన చేసి ప్రారంభించారు. సదరు కాంట్రాక్టర్‌ కేవలం కంకర పరిచాడు. గడిచిన మూడు సంవత్సరాలుగా కంకర రోడ్డుపై తండాకు బైకులపై వెళ్లిన వారిలో ఎంతో మంది కిందపడి గాయాలైన సంఘటనలున్నాయి. కంకరరాళ్లతో తమ వాహనాల టైర్లు పగులుతాయేమో అన్న భయంతో ఆటో డ్రైవర్లు, వాహనాల యజమానులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా బీటీ రోడ్డు నిర్మించి పనులు పూర్తి చేసి, పెద్దతండాకు బీటీరోడ్డు సౌకర్యం కల్పించాలని అందుకు తగ్గట్లుగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Oct 11 , 2026 | 11:33 PM