కవులకు పెద్ద దిక్కు రుక్మాంగదరెడ్డి
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:01 AM
దివంగత రుక్మాంగదరెడ్డి కవులకు పెద్ద దిక్కని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు.
- సంతాప సభలో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : దివంగత రుక్మాంగదరెడ్డి కవులకు పెద్ద దిక్కని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, వెల్దండ మండల కేంద్రంలోని ఆకృతి ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం కవి వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన రుక్మాంగ దరెడ్డి సంతాప సభ నిర్వహించారు. నెలపొ డుపు సాహిత్య, సాంస్కృతిక వేదిక, కల్వకుర్తి సాహితీ సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వ హించిన ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీసింగ్, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఒకే రోజు, ఒకే వేదికపై ఏడు పుస్తకాలను ఆవిష్కరించి రుక్మాందగరెడ్డి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. ప్రముఖ కవి మల్లేపల్లి శేఖర్‌రెడ్డికి ఆ యన మిత్రుడని, ఆయన రాసిన చివరి పుస్త కం రాఘవేంద్ర శతకాన్ని రుక్మాంగదరెడ్డి ము ద్రించారని తెలిపారు. కార్యక్రమంలో రుక్మాంగ దరెడ్డి కుటుంబ సభ్యులు యెన్నం పురుషోత్తం రెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, అక్షయ, అక్ష ర, అంకిత్‌రెడ్డి, కవులు దేవదానం, దేవకాటమ రాజు, నర్సింహులు, వహీద్‌ఖాన్, స్కైలాబ్, తగుళ్ల గోపాల్, గచ్చు రామకృష్ణ, కొమ్మగాని శీనయ్య, సబిత, ద్యాప విజితారెడ్డి పాల్గొన్నారు.