Share News

రైతులను ఆదుకునేందుకే కొనుగోలు కేంద్రాలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:36 AM

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ

రైతులను ఆదుకునేందుకే కొనుగోలు కేంద్రాలు

ఇల్లంతకుంట, ఎప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో శనివారం వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కేంద్రాలకు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తునే మరోవైపు అభివృద్ధిపై దృష్టిసారించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్‌పర్సన్‌ ఐరెడ్డి చైతన్యమహేందర్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీఓ శశికళ, ఏపీఎం కుమారస్వామి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రమణారెడ్డి, అయిలయ్య, సర్పంచ్‌ మామిడి రాజు, ఏఎమ్‌సీ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, నాయకులు ఒగ్గు రమేష్‌, తీగల పుష్పలత, కాత మల్లేశం, నేరెళ్ల విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ

మండల పరిషత్‌ కార్యాలయంలో అంగన్‌వాడీ టీచర్లకు మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసిందన్నారు. ఆటపాటల ద్వారా విద్యను అందించడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందివ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ ఉమారాణి, సూపర్‌వైజర్లు సూర్యకళ, చంద్రకళ, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 12:36 AM