Share News

టెక్ రంగంలో లేఆఫ్స్.. ఏఐతో సీనియర్లకే అధిక ముప్పు?

ABN , Publish Date - Apr 27 , 2026 | 03:21 PM

టెక్ రంగంలో లేఆఫ్స్ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా సీనియర్ ఉద్యోగులకు ముప్పు ఎక్కువగా ఉందన్న భావన నెలకొంది.

టెక్ రంగంలో లేఆఫ్స్.. ఏఐతో సీనియర్లకే అధిక ముప్పు?
Layoffs - AI

ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ఇటీవల భారీ స్థాయిలో తొలగింపులు చోటుచేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించినట్టు సంస్థ పేర్కొంది. ఉదయం వేళ ఈమెయిల్స్‌లో ఉద్యోగులకు లేఆఫ్స్ గురించి తెలిపింది. భారత్, యూఎస్, కెనడా, లాటిన్ అమెరికా దేశాల్లో ఈ లేఆఫ్స్ చోటుచేసుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో లేఆఫ్స్‌కు గురైన ఒక సీనియర్ ఉద్యోగి నీనా లూయిస్ ఆవేదన నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.

ఈ లేఆఫ్స్‌లో భాగంగా నీనా లూయిస్ ఏప్రిల్ 1న ఉద్యోగాన్ని కోల్పోయారు. తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను సంస్థలో 30 ఏళ్లుగా చేస్తున్నానని అన్నారు. కంపెనీ ఏఐపై దృష్టిపెట్టిందని ఆమె అన్నారు. ఈ పరిణామాలు తనకు షాకిచ్చాయని చెప్పారు. సంస్థలోని అంతర్గత ఆల్గోరిథమ్ ఒకటి సీనియర్ ఉద్యోగులను, మధ్యస్థాయి మేనేజర్లను లేఆఫ్స్‌కు ఎంపిక చేసి ఉండవచ్చని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఔట్‌స్టాండింగ్ స్టాక్ ఆప్షన్స్‌ ఉన్న వాళ్లు టార్గెట్ అయి ఉండవచ్చని చెప్పారు. ఒరాకిల్‌తో పాటు గత నెలలో మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అనేక సంస్థలు మొత్తం 20 వేల మందిని తొలగించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో, ఈ పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది.


ఈ అంశంపై నీనా లూయిస్ ఆ తరువాతి పోస్టుల్లో పలు కీలక కామెంట్స్ చేశారు. ప్రత్యేక లేఆఫ్స్‌ ఆల్గోరిథమ్‌ల గురించి తనకు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. ఉద్యోగులు కర్ణాకర్ణిగా అనుకున్న మాటలు, లేఆఫ్స్ తీరుతెన్నుల గురించి మాత్రమే తాను ప్రస్తావించానని చెప్పారు. ‘అందరిలాగే నా దృష్టికీ రకరకాల వదంతులు వస్తుంటాయి. లేఆఫ్స్ తీరుతెన్నులను దగ్గరగా ఈ వార్తలు ఉంటాయి. అంతేకానీ.. ప్రత్యేకమైన లేఆఫ్స్ సాఫ్ట్‌వేర్ ఉన్నట్టు నాకు తెలియదు. కానీ అంతమంది తొలగింపులకు గురవుతున్నారంటే ఏదో ఒక వ్యవస్థ ఉండే ఉండాలి’ అని కామెంట్ చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 04:29 PM