Share News

కాంగ్రెస్‌ పాలనలో సాగునీటి వ్యవస్థ సర్వనాశనం

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:22 PM

కాంగ్రెస్‌ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేశారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చే శారు.

కాంగ్రెస్‌ పాలనలో సాగునీటి వ్యవస్థ సర్వనాశనం
మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, చిత్రంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల, చిట్టెం

- మాజీ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి

వనపర్తి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేశారని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆంరఽధప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న జలచౌర్యం, కృష్ణా జలాల వినియోగంపై సోమవారం వనపర్తి పట్టణంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కులు రాష్ట్రంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. కేసీఆర్‌ ప్రతీ చుక్క నీటిని ఒడిసి పట్టి తెలంగాణను సస్య శ్యామలం చేసేందుకు కృషి చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన మూడేళ్లల్లో సాగునీటి వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తపన భావితరాల భవిష్యత్తు కోసం సాగిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ తపన ఆంధ్రా ప్రయోజనాలకే పరిమి తమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఎకరా కు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీలోని వెలి గొండ ప్రాజెక్టు కోసం ఏపీ 39 కిలోమీటర్ల టన్నెల్‌ పను లు పూర్తి చేసిందని, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఏపీకి రేవంత్‌ సర్కార్‌ కట్టుబానిసగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నియోజకవర్గంలో మిడిమిడి జ్ఞానంతో ప్రొజెక్టర్‌ పెట్టుకుని తలాతోక లేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఇటీవలే ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి విమర్శించారు. సమావేశంలో మా జీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డిలతో కలిసి గట్టుయాదవ్‌, వామన్‌గౌడ్‌, వాకిటి శ్రీధర్‌, పలుస రమేశ్‌గౌడ్‌, నందిమల్ల అశోక్‌, బీఆర్‌ఎస్‌ నాయ కులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:22 PM