Share News

చెపాక్‌లో చితక్కొట్టారు.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే..

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:48 PM

టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు. కీలక మ్యాచ్‌లో అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో రికార్డు స్కోరు సాధించారు.

చెపాక్‌లో చితక్కొట్టారు.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే..
IND vs ZIM T20 World Cup

టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు. కీలక మ్యాచ్‌లో అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో రికార్డు స్కోరు సాధించారు. గత మ్యాచ్‌ల్లో ఫామ్ లేమితో సతమతమైన అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55)తో పాటు హార్దిక్ (23 బంతుల్లో 50 నాటౌట్) హాఫ్ సెంచరీలు సాధించారు. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లందరూ సిక్స్‌లు కొట్టడం విశేషం. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది (IND vs ZIM T20 World Cup).


టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ (24) అదిరిపోయే ఆరంభం అందించాడు. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో తనదైన శైలిలో ఆడాడు. ఇక, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38), సూర్య కుమార్ (13 బంతుల్లో 33) కూడా వేగంగా ఆడారు. చివర్లో తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్), హార్దిక్ పాండ్యా కీలక పరుగులు చేశారు (Zimbabwe target 230).


బ్యాటర్లందరూ సమష్టిగా రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది (India vs Zimbabwe live score). టీమిండియా ఇన్నింగ్స్‌లో మొత్తం 18 సిక్స్‌లు నమోదయ్యాయి. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఇదే భారీ స్కోరు కావడం విశేషం. జింబాబ్వే ముందు భారీ టార్గెట్ ఉంచింది. జింబాబ్వే బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలింగ్ చేసిన అందరూ ఓవర్‌కు 8 పరుగులకు పైనే సమర్పించుకున్నారు. రిచర్డ్, ముజర్బాని, మపోసా, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి, టీమిండియా నిర్దేశించిన ఈ భారీ టార్గెట్‌ను జింబాబ్వే ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Updated Date - Feb 26 , 2026 | 08:50 PM