సెమీస్‌లో సినర్,గాఫ్
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:12 AM
టాప్ సీడ్ యానిక్ సినర్, ఏడో సీడ్ కొకొ గాఫ్ వింబుల్డన్ సెమీఫైనల్‌కు దూసుకుపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో...
పెగుల పరాజయం జూవింబుల్డన్
లండన్: టాప్ సీడ్ యానిక్ సినర్, ఏడో సీడ్ కొకొ గాఫ్ వింబుల్డన్ సెమీఫైనల్‌కు దూసుకుపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సినర్ (ఇటలీ) 7-5, 7-6 (4), 6-3తో అన్‌సీడెడ్ జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)ని చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండుగ్రాడ్‌స్లామ్‌ల విజేత గాఫ్ (అమెరికా) 4-6, 6-3, 6-3తో తన దేశానికే చెందిన నాలుగో సీడ్ జెస్సిక పెగులకు షాకిచ్చి తొలిసారి వింబుల్డన్ సెమీఫైనల్లో ప్రవేశించింది. ఈ విజయంతో 22 ఏళ్ల గాఫ్.. షరపోవా (2007) తర్వాత పిన్నవయస్సులో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల సెమీస్ చేరిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. సెమీఫైనల్లో 10వ సీడ్ కరొలినా ముచోవాతో గాఫ్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో క్వార్టర్స్‌లో ముచోవా (చెక్ రిపబ్లిక్) 7-6 (4), 6-4తో 14వ సీడ్ ఒసాకా (జపాన్)ను ఓడించింది. పురుషుల్లో రెండో సీడ్ జ్వెరెవ్, ఆరో సీడ్ టేలర్ ఫ్రిట్జ్, ఆర్థుర్ ఫెరీ క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!