పశ్చిమాసియా చెస్‌లో తెలుగోళ్ల సత్తా
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:45 AM
పశ్చిమాసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారిణులు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పశ్చిమాసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారిణులు శరణ్య నరహరి (గుంటూరు), సాయి అన్షిత (హైదరాబాద్), సయ్యద్ రౌదా (హైదరాబాద్) సత్తా చాటారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లోని అండర్-18 బ్లిట్జ్ విభాగంలో శరణ్య కాంస్యంతో మెరిసింది. అండర్-10 క్లాసికల్ విభాగంలో అన్షిత్ స్వర్ణం, బ్లిట్జ్‌లో రజతం సాధించింది. అండర్-10 ర్యాపిడ్ విభాగంలో రౌదా కాంస్యం సొంతం చేసుకుంది.
ఈ వార్తలూ చదవండి
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ