వావ్..వివాన్
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:29 AM
భారత షూటర్ వివాన్ కపూర్‌కు త్రుటిలో ప్రపంచ టైటిల్ చేజారింది. అయితేనేం ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిసిన...
ఒలింపిక్ బెర్త్ సైతం..
రజతంతో మెరిసిన భారత షూటర్
ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్
దోహా: భారత షూటర్ వివాన్ కపూర్‌కు త్రుటిలో ప్రపంచ టైటిల్ చేజారింది. అయితేనేం ఇక్కడ జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిసిన వివాన్2028 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్ బెర్త్‌ను అందించాడు. ట్రాప్ విభాగం ఫైనల్లో కపూర్, కువైట్‌కు చెందిన అబ్దుల్ రహ్మాన్ ఇద్దరూ..29 పాయింట్లు స్కోరు చేసి సమంగా నిలిచారు. దాంతో షూటాఫ్ అనివార్యం కాగా..2-3తో ఓడిన వివాన్ రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే కపూర్ రజత పతకం దరిమిలా 2028 విశ్వక్రీడల బెర్త్ భారత్‌కు లభించింది. క్వి యింగ్ (చైనా) కాంస్యం సొంతం చేసుకున్నాడు. రాబోయే ఒలింపిక్స్‌కు షూటింగ్‌లో భారత్‌కిది మూడో బెర్త్ కావడం విశేషం. కాగా..కర్నీసింగ్ (రజతం), మానవ్‌జీత్ సింగ్ సంధూ (స్వర్ణం), జొరావర్ సింగ్ సంధూ (కాంస్యం) తర్వాత ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పతకం నెగ్గిన నాలుగో భారత ట్రాప్ షూటర్‌గా వివాన్ కపూర్ రికార్డు నెలకొల్పాడు.