Share News

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 02:35 AM

అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు...

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్‌

లాసాన్నె: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్కాడీ డ్వొర్కోవిచ్‌పై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించడంతో అతడు బాధ్యతల నుంచి తాత్కాలికంగా వైదొలిగాడు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి సంబంధించిన కారణాలతో విధించిన ఈ ఆంక్షల జాబితాలో గతంలో రష్యా ఉప ప్రధానిగా ఉన్న ఆర్కాడీ పేరును కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో ఫిడే డిప్యూటీ అధ్యక్షుడిగా ఉన్న ఆనంద్‌కు ప్రమోషన్‌ లభించినట్టయ్యింది.

ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్

Updated Date - Jul 25 , 2026 | 02:35 AM