Share News

ఐపీఎల్‌కు అతీతంగా ఎదగండి!

ABN , Publish Date - May 20 , 2026 | 01:38 AM

రాత్రికి రాత్రే స్టార్లను చేసే ఐపీఎల్‌కు అతీతంగా ఎదగాలని యువ క్రికెటర్లకు కోహ్లీ పిలుపునిచ్చాడు. క్రికెట్‌ ప్రపంచం నుంచి గౌరవం అందుకొనేందుకు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్లుగా,,,

ఐపీఎల్‌కు అతీతంగా ఎదగండి!

యువ క్రికెటర్లకు కోహ్లీ సూచన

బెంగళూరు: రాత్రికి రాత్రే స్టార్లను చేసే ఐపీఎల్‌కు అతీతంగా ఎదగాలని యువ క్రికెటర్లకు కోహ్లీ పిలుపునిచ్చాడు. క్రికెట్‌ ప్రపంచం నుంచి గౌరవం అందుకొనేందుకు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్లుగా రాణించాలని సూచించాడు. ‘నేటి కాలంలో డబ్బే అన్నింటినీ నడిపిస్తోంది. ఐపీఎల్‌లో 20 బంతుల్లోనే 40-50 పరుగులు చేసి ఒక్కసారిగా పాపులర్‌ అవుతున్నారు. ఆర్థికంగానూ సౌకర్యవంతమైన స్థితికి చేరుకొంటున్నారు. అయితే, అదే అంతిమ లక్ష్యం కారాదు’ అని ఆర్సీబీ ఇన్నోవేటివ్‌ ల్యాబ్స్‌ ఇండియన్‌ స్పోర్ట్స్‌ సమ్మిట్‌లో కోహ్లీ అన్నాడు. ఐపీఎల్‌ మాత్రమే లక్ష్యంగా ప్రయాణం సాగకూడదని యువ ఆటగాళ్లకు విరాట్‌ సూచించాడు. తాను మళ్లీ క్రికెట్‌ను ఆస్వాదించడానికి కోచ్‌లు రాహుల్‌ ద్రవిడ్‌, విక్రమ్‌ రాథోడ్‌ ఎంతో సహకారం అందించారన్నాడు.

ఇవి కూడా చదవండి..

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 20 , 2026 | 01:38 AM