వెంకట్రామ్‌కు స్వర్ణం
ABN , Publish Date - Jun 01 , 2026 | 03:16 AM
తెలుగు కుర్రాడు మొగలి వెంకట్రామ్‌రెడ్డి ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో అదరహో అనిపించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల 800 మీటర్ల రేసులో కర్నూలుకు...
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్
హాంకాంగ్: తెలుగు కుర్రాడు మొగలి వెంకట్రామ్‌రెడ్డి ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో అదరహో అనిపించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల 800 మీటర్ల రేసులో కర్నూలుకు చెందిన వెంకట్రామ్ 1:48.27 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం సాధించాడు. వెంకట్రామ్‌కు ఇది వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్. ఇక, ఇదే టోర్నీలో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు దక్కాయి. మహిళల 5 వేల మీటర్ల రేసులో ముస్కాన్, 4గీ400 మీటర్ల మహిళల రిలే జట్టు పసిడి పతకాలు కొల్లగొట్టాయి. డిస్కస్ త్రోలో నిశ్చయ్, మహిళల 4గీ100 మీటర్ల రిలే జట్టు రజతాలు నెగ్గగా, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్లు కాంస్యం సాధించాయి.
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..