రెండో స్థానానికి వైశాలి
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:04 AM
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో వరుసగా రెండో గెలుపును నమోదు చేసిన భారత జీఎం వైశాలి..
క్యాండిడేట్స్ చెస్
పఫోస్ (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో వరుసగా రెండో గెలుపును నమోదు చేసిన భారత జీఎం వైశాలి.. ద్వితీయస్థానానికి ఎగబాకింది. మహిళల విభాగంలో ఆదివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో టాన్ జోంగ్యీ (చైనా)పై వైశాలి గెలిచింది. తెల్లపావులతో ఆడిన వైశాలి 51 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. మొత్తం 7 రౌండ్ల నుంచి వైశాలి 4 పాయింట్లు సాధించింది. ఓపెన్‌లో ఫాబినో కరువానా (అమెరికా)తో ఏడో రౌండ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించి, 3.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం
చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్