నా కుమారుడితో స్ట్రిక్ట్‌గా ఉండేవాడిని.. వైభవ్ సూర్యవంశీ తండ్రి
ABN , Publish Date - Jun 06 , 2026 | 09:24 PM
వైభవ్ సూర్యవంశీ నిరంతర శ్రమతో అద్భుత అవకాశాన్ని అందుకున్నాడని అతడి తండ్రి పేర్కొన్నారు. అతడితో తాను కాస్త స్ట్రిక్ట్‌గా ఉండేవాడినని కూడా చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌కు చెందిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల ఐపీఎల్‌లో కూడా తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి చిన్ననాటి కల సాకారమైనందుకు వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ హర్షం వ్యక్తం చేశారు. ‘వైభవ్ చిన్న వయసులోనే క్రికెట్‌ను తన లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ కృషి ఫలితంగా నేడు భారత్ తరఫున బరిలోకి దిగే అద్భుత అవకాశం అతడికి దక్కింది’ అని అన్నాడు. ఈ రోజు తమ కుటుంబం అంతా సంతోషంగా ఉందని అన్నారు. యావత్ దేశం తన కుమారుడికి అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న తీరును చూస్తే తన మనసు గర్వంతో ఉప్పొంగుతోందని చెప్పారు.
వైభవ్ ప్రతిభ చిన్నతనంలోనే తాను గుర్తించానని సంజీవ్ చెప్పారు. ఒకసారి అతడికి బ్యాట్ ఇస్తే అద్భుతంగా ఆడాడని చెప్పారు. అది చూసి తనకే ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. వైభవ్‌కు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ క్రమశిక్షణ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడినని ఆయన చెప్పారు. ‘అతడు ఎప్పుడైనా పొరపాటు చేస్తే కోపగించుకునే వాడిని. కానీ అదంతా వైభవ్ మంచికే’ అని అన్నారు. అతడి ఎదుగుదలకు తన తిట్లు కూడా కొంత ఉపయోగపడ్డాయని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ వర్సెస్ అఫ్గాన్ టెస్టు.. తొలి రోజు టీమిండియా పరుగుల వరద
కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..