Share News

అమెరికా ధమాకా

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:30 AM

ఫిఫా ప్రపంచక్‌పలో ఆతిథ్య అమెరికా జట్టు ఆరంభంలోనే అదరగొట్టింది. శనివారం గ్రూప్‌-డిలో భాగంగా జరిగిన తమ తొలి పోరులో పరాగ్వేను..

అమెరికా ధమాకా

  • నాలుగు గోల్స్‌తో విజృంభణ

  • పరాగ్వేపై 4-1తో గెలుపు

ఇంగిల్‌వుడ్‌ (యూఎస్‌): ఫిఫా ప్రపంచక్‌పలో ఆతిథ్య అమెరికా జట్టు ఆరంభంలోనే అదరగొట్టింది. శనివారం గ్రూప్‌-డిలో భాగంగా జరిగిన తమ తొలి పోరులో పరాగ్వేను 4-1తో చిత్తుచేసి వారెవ్వా అనిపించింది. ఈ మెగా టోర్నీలో ఓ మ్యాచ్‌లో అమెరికా నాలుగు గోల్స్‌ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మ్యాచ్‌ మొదలైన ఏడో నిమిషంలోనే పరాగ్వే ఆటగాడు డామియన్‌ బొబాడిల్లా చేసిన పొరపాటు అమెరికాకు కలిసొచ్చింది. ప్రత్యర్థి పాస్‌ను అడ్డుకునే క్రమంలో బొబాడిల్లా బంతిని తానే స్వయంగా నెట్‌లోకి పంపి ఓన్‌ గోల్‌ చేశాడు. దీంతో అమెరికా 1-0తో ముందుకెళ్లింది. ఆ తర్వాత అమెరికా స్ట్రయికర్‌ ఫోలారిన్‌ బలోగన్‌ (31వ, 45+5వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ అందించగా, ఆఖర్లో గియోవాని రెయ్‌నా (90+8వ) ఓ గోల్‌ చేసి అమెరికా ఆధిక్యాన్ని పెంచాడు. పరాగ్వే తరఫున ఏకైక గోల్‌ను మోరిసియో (73వ) చేశాడు.

Updated Date - Jun 14 , 2026 | 03:30 AM