Share News

యువన్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:44 AM

హైదరాబాద్‌ పొలో అండ్‌ రైడింగ్‌ క్లబ్‌ (హెచ్‌పీఆర్‌సీ) నిర్వహించిన జూనియర్‌ ఈక్వెస్ట్రియన్‌ చాలెంజ్‌లో తుమ్మల యువన్‌...

యువన్‌ డబుల్‌ ధమాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ పొలో అండ్‌ రైడింగ్‌ క్లబ్‌ (హెచ్‌పీఆర్‌సీ) నిర్వహించిన జూనియర్‌ ఈక్వెస్ట్రియన్‌ చాలెంజ్‌లో తుమ్మల యువన్‌ రెండు పతకాలు కొల్లగొట్టాడు. గండిపేటలో జరిగిన ఈ పోటీల్లో షో జంపింగ్‌ 40సీఎం ఓపెన్‌ విభాగంలో యువన్‌ విజేతగా నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. షో జంపింగ్‌ 40సీఎం అం డర్‌-12 విభాగంలో యువన్‌ రెండో స్థానం దక్కించుకొని, రజతంతో మెరిశాడు. యువన్‌ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనవడు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌

Updated Date - Aug 17 , 2026 | 05:44 AM