సత్తాచాటిన తెలుగు ఆర్చర్లు
ABN , Publish Date - Jun 02 , 2026 | 02:58 AM
ఆలిండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్‌లో తెలుగు ఆర్చర్లు సత్తా చాటారు. గోవాలో జరిగిన ఈ పోటీల్లోని అండర్- 18...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆలిండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్‌లో తెలుగు ఆర్చర్లు సత్తా చాటారు. గోవాలో జరిగిన ఈ పోటీల్లోని అండర్- 18 కాంపౌండ్ విభాగంలో అల్లూరు కనిష్క (భీమవరం) స్వర్ణం, వీరవల్లి జోషిత (హైదరాబాద్), కొప్పర్తి శివ లేహ్య రెడ్డి (విజయవాడ) తొలి మూడు స్థానాలను సాధించారు. ఫైనల్లో కనిష్క 145-142తో జోషితపై నెగ్గింది. రికర్వ్ అండర్-15, అండర్-18 విభాగాల్లో చెరుకూరి డాలీ శివాని స్వర్ణ పతకాలు సాధించింది.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీ విజయం.. బెంగళూరులో అభిమానుల వీరంగం
టైటిల్‌తో పాటు ఆర్సీబీ ఖాతాలో అరుదైన రికార్డ్