తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ ఆవిష్కరణ
ABN , Publish Date - May 20 , 2026 | 01:33 AM
యువ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ (టీజేబీఎల్)ను ఆవిష్కరించారు....
హైదరాబాద్: యువ ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ జూనియర్ బాస్కెట్‌బాల్ లీగ్ (టీజేబీఎల్)ను ఆవిష్కరించారు. రాష్ట్ర బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ లీగ్‌లో 6 జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్ హరికేన్స్, వికారాబాద్ ప్రిడేటర్స్, నల్లగొండ నింజాస్, రంగారెడ్డి రూలర్స్, వరంగల్ వైల్డ్‌ఫైర్స్, మెదక్ మాన్‌స్టర్స్‌లు వేలంలో మొత్తం రూ. 1.48 కోట్లకు అమ్ముడైనట్టు నిర్వాహకులు తెలిపారు. లీగ్ కోసం 400 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఆటగాళ్ల వేలం శుక్రవారం జరగనుంది.
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్