రాము, సోముకు పతకాలు జాతీయ యూత్ అథ్లెటిక్స్
ABN , Publish Date - Sep 03 , 2026 | 04:54 AM
జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన...
లుథియానా: జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన అండర్-18 బాలుర 400 మీటర్ల రేసులో రాము స్వర్ణ పతకం అందుకున్నాడు. రాము 47.21 సెకన్లలో రేసు ముగించాడు. మానస్ (మహారాష్ట్ర) రజతం, ఎబిన్ (కేరళం) కాంస్యం గెలిచారు. బాలుర హెప్టాథ్లాన్‌లో సోము కాంస్యం దక్కించుకున్నాడు. సోము 4587 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. నాగర్ (మధ్యప్రదేశ్) స్వర్ణం, స్వప్నిల్ (పశ్చిమ బెంగాల్) రజతాలు నెగ్గారు.
ఇవి కూడా చదవండి:
కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్