దీప్తి ఉద్యోగానికి అసెంబ్లీ ఆమోదం
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:56 AM
తెలంగాణకు చెందిన అంతర్జాతీయ పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2 ఉద్యోగానికి...
పర్వతగిరి (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన అంతర్జాతీయ పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్-2 ఉద్యోగానికి ఎట్టకేలకు అసెంబ్లీలో సోమవారం ఆమోదం తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి దినసరి కూలీ పనులు చేసే కుటుంబంనుంచి ఉన్నతస్థాయికి ఎదిగింది. ఈ సందర్భంగా దీప్తి తల్లిదండ్రులు జీవాంజి ధనమ్మ, యాదగిరి, స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు.. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం