Share News

స్విమ్మింగ్‌లో తీర్థుకు స్వర్ణం

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:49 AM

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు స్విమ్మర్లు సత్తా చాటారు...

స్విమ్మింగ్‌లో తీర్థుకు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు స్విమ్మర్లు సత్తా చాటారు. గురువారం భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో విజయవాడ స్విమ్మర్‌ తీర్థు సామదేవ్‌ 200 మీటర్ల మెడ్లే విభాగంలో స్వర్ణం సాధించగా, హైదరాబాద్‌ స్వి మ్మర్‌ వర్షిత్‌ కాంస్యం దక్కించుకున్నాడు. పాల్‌ (కర్ణాటక)కు రజ తం లభించింది. ఇతర పోటీ ల్లో ఆంధ్రకు చెందిన పావనీ సరయు 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో, బాలుర 1500 మీ., ఫ్రీస్టయిల్‌లో యజ్ఞ సాయి కాంస్య పతకాలు సాధించారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 02:49 AM