‘తైపీ’ విజేత తన్వీ
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:01 AM
తన్వీ శర్మ కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అందుకుంది. తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది...
తైపీ: తన్వీ శర్మ కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అందుకుంది. తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల తన్వీ 21-16, 21-16తో వియత్నాంకు చెందిన తు లిన్ ఎన్‌గ్యూయెన్‌కు షాకిచ్చింది. తద్వారా 2008లో సైనా నెహ్వాల్ తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన భారత షట్లర్‌గా తన్వీ రికార్డు నెలకొల్పింది. ఈ టోర్నీ చరిత్రలో తుదిపోరుకు చేరిన పిన్నవయస్సు షట్లర్‌గానూ తన్వీ మరో ఘనత అందుకుంది. కొరియా డబుల్స్ దిగ్గజం లీ యాంగ్ డే (17 సంవత్సరాల 287 రోజులు) పేరిట ఉన్న రికార్డును తన్వీశర్మ (17 ఏళ్ల 222 రోజులు) తిరగ రాసింది.
ఇవి కూడా చదవండి:
దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్
ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన