Share News

తజిందర్‌కు షాక్‌

ABN , Publish Date - May 26 , 2026 | 01:58 AM

స్టార్‌ షాట్‌పుట్టర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌కు మధ్యప్రదేశ్‌ అథ్లెట్‌ సమర్‌దీప్‌ సింగ్‌ షాకిచ్చాడు. ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌...

తజిందర్‌కు షాక్‌

షాట్‌పుట్‌ విజేత సమర్‌దీప్‌

ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌

రాంచీ: స్టార్‌ షాట్‌పుట్టర్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌కు మధ్యప్రదేశ్‌ అథ్లెట్‌ సమర్‌దీప్‌ సింగ్‌ షాకిచ్చాడు. ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా సోమవారం జరిగిన పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్‌ పాల్‌ (20.07 మీ.)ను వెనక్కు నెట్టిన 25 ఏళ్ల సమర్‌దీప్‌ (20.46మీ) స్వర్ణం దక్కించుకున్నాడు. తజిందర్‌ రజతానికే పరిమితమయ్యాడు. ఈక్రమంలో కామన్వెల్త్‌ క్రీడల అర్హత ప్రమాణ దూరాన్ని (20.36మీ) సమర్‌దీప్‌ అధిగమించాడు. పురుషుల 200 మీ. పరుగులో అనిమేష్‌ (ఒడిశా, 20.64సె), మహిళల 200మీ.లో కుసుమా ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌, 23.94సె.) విజేతలుగా నిలిచారు.

ఇవీ చదవండి:

బహిరంగ నమాజ్‌, జంతుబలి నిషేధం.. సీఎం యోగి కీలక ఆదేశాలు

ఎన్‌టీఏ గుణపాఠం నేర్వకపోవడం విచారకరం.. 'నీట్' లీక్ కేసుపై సుప్రీం కోర్టు

Updated Date - May 26 , 2026 | 01:58 AM