Share News

గ్రీకు వీరుడు.. సాధించాడు

ABN , Publish Date - Jul 20 , 2026 | 05:22 AM

దాదాపు ఏడాదిన్నరగా టైటిల్‌ కోసం వేచిచూస్తున్న గ్రీకు టెన్నిస్‌ స్టార్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు...

గ్రీకు వీరుడు.. సాధించాడు

సిట్సిపా్‌సకు ‘స్విస్‌’ టైటిల్‌

గస్తాద్‌ (స్విట్జర్లాండ్‌): దాదాపు ఏడాదిన్నరగా టైటిల్‌ కోసం వేచిచూస్తున్న గ్రీకు టెన్నిస్‌ స్టార్‌ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన స్విస్‌ ఓపెన్‌లో 27 ఏళ్ల సిట్సిపాస్‌ చాంపియన్‌గా నిలిచాడు. సింగిల్స్‌ తుదిపోరులో ప్రపంచ మాజీ మూడో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ 6-4, 6-7(3), 6-3తో రాఫెల్‌ కొలిగ్నాన్‌ (బ్రెజిల్‌)ను ఓడించి ట్రోఫీ అందుకున్నాడు. సిట్సిపాస్‌ చివరిగా గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా అతనికిది కెరీర్‌లో 13వ ఏటీపీ టైటిల్‌. ఇక, సిట్సిపాస్‌ 2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2023లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రన్నర్‌పగా నిలిచాడు.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 05:22 AM