క్రీడలకు రూ. 4479 కోట్లు
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:39 AM
కేంద్ర క్రీడల బడ్జెట్‌లో.. క్రీడా పరికరాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి తొలిసారి రూ. 500 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు...
కేంద్ర బడ్జెట్‌లో క్రీడా పరికరాల తయారీకి ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడల బడ్జెట్‌లో.. క్రీడా పరికరాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రంగానికి తొలిసారి రూ. 500 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయించారు. అయితే మొత్తం క్రీడలు, యువజన సర్వీసుల శాఖ బడ్జెట్ గత ఏడాది కంటే రూ. వేయి కోట్లకు పైగా పెరిగింది. మొత్తంగా ఈసారి క్రీడా రంగానికి రూ.4,479.88 కోట్లు ఇచ్చారు. 2024-24తో పోల్చితే రూ.1133.34 కోట్లు అదనంగా పెరిగింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) బడ్జెట్‌ను రూ. 880 కోట్ల నుంచి రూ. 917.38 కోట్లకు పెంచారు. జాతీయ డోపింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బడ్జెట్‌లను నిరుటి కంటే తగ్గించడం గమనార్హం. ఖేలో ఇండియా ఈవెంట్‌కు రూ.924.35 కోట్లు, కామన్వెల్త్ క్రీడల సహాయం కార్యక్రమానికి రూ. 50 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఇది 28.05 కోట్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి:
అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ
భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ