Share News

స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ సెమీస్‌ నేడు

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:08 AM

ఫిఫా ప్రపంచక్‌పలో సెమీఫైనల్‌ సమరానికి నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. తొలి సెమీ్‌సలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగే పోరులో...

స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ సెమీస్‌ నేడు

నేటి అర్ధరాత్రి

12.30 నుంచి

యునైటెడ్‌ 8లో

ఫైనల్‌ చేరేదెవరో?

ఫిఫా ప్రపంచకప్‌

టెక్సాస్‌ (యూఎస్‌): ఫిఫా ప్రపంచక్‌పలో సెమీఫైనల్‌ సమరానికి నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. తొలి సెమీ్‌సలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి జరిగే పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫ్రాన్స్‌, మూడో ర్యాంకరైన స్పెయిన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫ్రాన్స్‌ తరఫున కిలియన్‌ ఎంబాపె అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఈ ప్రపంచక్‌పలో ఆడిన ఆరు మ్యాచుల్లో 8 గోల్స్‌ చేసి గోల్డెన్‌ బూట్‌ రేసులో మెస్సీతో కలిసి టాప్‌లో ఉన్నాడు. ఎంబాపె తర్వాత డెంబెలె ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఇప్పటికే అతను ఆరు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌ కొట్టాడు. గత ఏడు టోర్నీల్లో 4 సార్లు సెమీస్‌ చేరడం ఫ్రాన్స్‌ ఫామ్‌ను చాటుతోంది. ఇక మాజీ విజేత స్పెయిన్‌ 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా సెమీస్‌ ఆడుతోంది. ఈ నేపథ్యంలో స్పెయిన్‌ తరఫున కెప్టెన్‌ రోడ్రితో పాటు యువ కెరటం లామినె యామల్‌ కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఈ రెండు జట్లు ఇప్పటిదాకా మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచుల్లో ముఖాముఖి తలపడితే స్పెయిన్‌ 18 విజయాలతో పైచేయిగా ఉంది. ఫ్రాన్స్‌ 13 గెలిచింది. ఏడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కాగా, ఇప్పటిదాకా ఫిఫా ప్రపంచక్‌పలో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే ముఖాముఖి పోటీపడగా, ఆ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ నెగ్గింది.

ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

Updated Date - Jul 14 , 2026 | 05:08 AM