చరిత్ర సృష్టిస్తాడనుకొన్న సొమాలియా రెఫరీకి నో ఎంట్రీ
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:52 AM
ఫిఫా వరల్డ్‌క్‌పలో తొలి సొమాలియా రెఫరీగా చరిత్ర సృష్టిస్తాడనుకొన్న ఒమర్ అబ్దుల్‌ఖదీర్ అర్టాన్‌కు అమెరికా అధికారులు షాకిచ్చారు..
మయామి (యూఎస్): ఫిఫా వరల్డ్‌క్‌పలో తొలి సొమాలియా రెఫరీగా చరిత్ర సృష్టిస్తాడనుకొన్న ఒమర్ అబ్దుల్‌ఖదీర్ అర్టాన్‌కు అమెరికా అధికారులు షాకిచ్చారు. మెగా ఈవెంట్‌లో మ్యాచ్ అధికారిగా వ్యవహరించేందుకు ఇస్తాంబుల్ నుంచి మయామికి వచ్చిన అర్టాన్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్‌పోర్టు నుంచి తిప్పిపంపారు. అతడి వద్ద వీసా, సక్రమమైన పత్రాలు ఉన్నా.. అర్టాన్‌ను అనుమతించలేదు. అర్టాన్ వరల్డ్‌క్‌పలో భాగం కావడం లేదని ఫిఫా ఓ ప్రకటనలో తెలిపింది. ‘వెట్టింగ్’ (తనిఖీపరమైన ఆందోళనలు) కారణంగా అర్టాన్‌కు అనుమతి నిరాకరించినట్టు అధికారులు తెలిపారు. అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో సోమాలియా ఉంది. 2025లో ఆఫ్రికా అత్యుత్తమ రెఫరీగా నిలిచిన అర్టాన్.. ఫిఫా 52 మంది రెఫరీల ప్యానెల్‌కు కూడా ఎంపికయ్యాడు.
ఇవి కూడా చదవండి:
ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?
ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!