Share News

44 ఏళ్ల వయసులో సింగిల్స్‌కు..

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:12 AM

టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ పునరాగమనంలో సింగిల్స్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండువారాల క్రితం...

 44 ఏళ్ల వయసులో సింగిల్స్‌కు..

వింబుల్డన్‌లో ఆడనున్న సెరెనా

లండన్‌: టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ పునరాగమనంలో సింగిల్స్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రెండువారాల క్రితం క్వీన్స్‌ క్లబ్‌ టోర్నీలో డబుల్స్‌ ఆడిన సెరెనా.. త్వరలో జరిగే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సింగిల్స్‌ కూడా ఆడనుంది. ఈ మేరకు 44 ఏళ్ల సెరెనాకు సింగిల్స్‌లోనూ వైల్డ్‌కార్డ్‌ ఇచ్చినట్టు ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ ప్రకటించింది. సోదరి వీనస్‌ విలియమ్స్‌తో కలిసి సెరెనాకు ఇప్పటికే డబుల్స్‌లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ లభించిన సంగతి తెలిసిందే. వింబుల్డన్‌ ఈనెల 29న మొదలవనుంది.

ఈ వార్తలనూ చదవండి:

లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Updated Date - Jun 23 , 2026 | 05:12 AM