Share News

సాత్విక్‌కు గాయం వైదొలగిన భారత ద్వయం

ABN , Publish Date - Jun 04 , 2026 | 01:42 AM

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి వైదొలగింది. బుధవారం...

సాత్విక్‌కు గాయం వైదొలగిన భారత ద్వయం

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి వైదొలగింది. బుధవారం డబుల్స్‌ తొలి రౌండ్‌లో మలేసియా జంట కాంగ్‌ జింగ్‌/అరోన్‌ తాయ్‌తో భారత ద్వయం తలపడుతున్న సమయంలో సాత్విక్‌ భుజానికి గాయమైంది. దాంతో సాత్విక్‌/చిరాగ్‌ అర్దంతరంగా తప్పుకొన్నారు. అప్పటికి భారత జంట 6-11తో వెనుకంజలో నిలిచింది. సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ఆయుష్‌ శెట్టి 8-21, 22-20, 21-15తో హాంగ్‌ యాంగ్‌ వెంగ్‌ (చైనా)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మిక్స్‌డ్‌లో రుత్వికా శివానీ/రోహన్‌ ద్వయం 21-14, 21-14తో వరల్డ్‌ నెం.20 జోడీ యాంగ్‌/లింగ్‌ (తైపీ)కి షాకిచ్చి రౌండ్‌-16కి చేరింది. ప్రణయ్‌ 17-21, 21-16, 19-21తో ఎన్‌గ్యుయెన్‌ చేతిలో, ఉన్నతి 15-21, 14-21తో ఒకుహర చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 01:43 AM