Share News

‘సింగపూర్‌’ విజేత సాత్విక్‌ జోడీ

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:21 AM

భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. తొలిసారి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకొంది. ...

‘సింగపూర్‌’ విజేత సాత్విక్‌ జోడీ

తొలిసారి డబుల్స్‌ టైటిల్‌ కైవసం

సింగపూర్‌: భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. తొలిసారి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 18-21, 21-17, 21-16తో ఇండోనేసియాకు చెందిన వరల్డ్‌ నెం:3 జోడీ ఫజర్‌ అల్ఫియాన్‌-షోహిబుల్‌ ఫిక్రిని ఓడించింది. గడచిన రెండేళ్లలో సాత్విక్‌ జోడీకి ఇదే మొదటి టైటిల్‌ కాగా.. ఓవరాల్‌గా కెరీర్‌లో తొమ్మిదోది. ఇక, సింగపూర్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగానూ సాత్విక్‌ ద్వయం రికార్డులకెక్కింది.

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:21 AM