80 సెకన్లలోనే..
ABN , Publish Date - Jul 20 , 2026 | 05:24 AM
భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఏ) ఫైటర్ సంగ్రామ్ సింగ్ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు. ఎమ్‌ఎమ్‌ఏ ఫైట్‌లో పాకిస్థాన్ ఆటగాడు...
పాక్ ఆటగాడిని నాకౌట్ చేసిన భారత ఫైటర్ సంగ్రామ్
ఎమ్‌ఎమ్‌ఏ ఆసియా
చాంపియన్‌షిప్ సొంతం
కౌలాలంపూర్: భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్‌ఎమ్‌ఏ) ఫైటర్ సంగ్రామ్ సింగ్ అంతర్జాతీయ వేదికపై అదరగొట్టాడు. ఎమ్‌ఎమ్‌ఏ ఫైట్‌లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ అబిద్ అలీని కేవలం 80 సెకన్లలోనే నాకౌట్ చేసి సంచలనం సృష్టించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సంగ్రామ్ అలవోకగా గెలిచి ప్రతిష్టాత్మక స్ట్రయిక్ ఆసియా చాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన 40 ఏళ్ల సంగ్రామ్.. కొన్నాళ్లక్రితమే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ వైపు మారాడు. ఎమ్‌ఎమ్‌ఏలో సంగ్రామ్‌కిది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. అతను ఈ క్రీడలో ఓటమన్నదే లేకుండా అజేయంగా దూసుకెళుతున్నాడు.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!