‘తుర్కియే’ చాంప్.. నచికేత్
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:46 AM
ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న తెలుగు యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు...
హైదరాబాద్: ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టైటిల్ నెగ్గి జోరుమీదున్న తెలుగు యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు.. మరో అంతర్జాతీయ ఈవెంట్‌లో సత్తా చాటాడు. తుర్కియే జూనియర్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం ఇస్తాంబుల్‌లో జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో నచికేత్ 21-11, 23-21తో తుర్కియేకు చెందిన టాప్‌సీడ్ మెమెత్ టోరెమి్‌సను చిత్తుచేసి ట్రోఫీ అందుకున్నాడు. నచికేత్ హైదరాబాద్‌లోని చేతన్ ఆనంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్