Share News

సింధు శుభారంభం

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:09 AM

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మంగళ వారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, గాయత్రి-జాలీ జోడీ నిష్క్రమించగా...

సింధు శుభారంభం

‘ఇండోనేసియా’లో కిడాంబి, లక్ష్య, గాయత్రి జోడీ అవుట్‌

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మంగళ వారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, గాయత్రి-జాలీ జోడీ నిష్క్రమించగా.. పీవీ సింధు, అర్జున్‌-హరి జోడీ ముందంజ వేసింది. 51 నిమిషాల పాటు జరిగిన సింగిల్స్‌ పోరులో సింధు 25-23, 21-16, బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. డబుల్స్‌లో అర్జున్‌-హరిహరన్‌ ద్వయం 21-18, 21-10తో నూర్‌ అజ్రియన్‌-టాన్‌ వీ కియాంగ్‌ (మలేషియా) జోడీపై గెలిచింది. శ్రీకాంత్‌ 19-21, 15-21తో యుషి తనాక (జపాన్‌) చేతిలో, లక్ష్యసేన్‌ 19-21, 16-21తో అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇతర పోటీల మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌, డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్‌ జంట, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల-తనీషా జోడీ తొలి రౌండ్‌లో ఓడి ఇంటిముఖం పట్టారు.

టాప్‌-10లోకి

సింధు ర్యాంకింగ్స్‌లో దాదాపు మూడేళ్ల తర్వాత తిరిగి టాప్‌-10లోకి ప్రవేశించింది. ప్రస్తుతం సింధు 11వ ర్యాంక్‌ నుంచి 10వ స్థానానికి ఎగబాకింది.

ఇవి కూడా చదవండి:

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

Updated Date - Jun 03 , 2026 | 05:09 AM