స్వదేశం చేరిన సింధు
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:39 AM
దుబాయ్‌లో చిక్కుకుపోయిన షట్లర్ సింధు స్వదేశానికి క్షేమంగా చేరుకొంది. మంగళవారం బెంగళూరు చేరానని సింధు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లే క్రమంలో...
న్యూఢిల్లీ: దుబాయ్‌లో చిక్కుకుపోయిన షట్లర్ సింధు స్వదేశానికి క్షేమంగా చేరుకొంది. మంగళవారం బెంగళూరు చేరానని సింధు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లే క్రమంలో యూఏఈలో ఆగింది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలాన్ని మూసివేయడంతో శనివారం నుంచి అక్కడే ఉండి పోయింది. ప్రత్యేక సర్వీ్‌సలను ఏర్పాటు చేయడంతో స్వదేశానికి తిరిగి వచ్చింది.
ఇలాంటి అనుభవం.. మళ్లీ వద్దు
దుబాయ్‌లో చిక్కుకుపోయిన ఆ మూడు రోజులూ ప్రశాంతంగా ఉండడానికి ఎంతో ఇబ్బందిపడినట్టు సింధు చెప్పింది. తన జీవితంలో ఇలాంటి అనుభవం మళ్లీ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పింది. ‘మేమున్న ప్రదేశానికి చాలా దగ్గర్లో భారీ శబ్దం వినిపించినప్పుడు భయమేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండడమే మనం చేయగలిగింది. కానీ, అలా ఉండలేమనే సంగతి తెలుసు. ఇదో అనుభవంగా భావించా. టోర్నీలో పాల్గొనేందుకు లండన్ వెళ్లడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించా. కానీ, విమాన సర్వీస్‌లు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయా. టోర్నీకి దూరమవక తప్పలేదు. సోమవారం రాత్రి భారత్‌కు విమానాలున్నాయనే సందేశం రావడంతో.. నా క్షేమమే ముఖ్యమని భావించి తిరిగొచ్చేశా’ అని సింధు పేర్కొంది. కాగా, ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి దూరమైనందుకు నిబంధనల ప్రకారం సింధుపై విధించాల్సిన రూ. 4.60 లక్షల జరిమానాను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్