Share News

సెమీస్‌లో సింధు

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:39 AM

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీ్‌సకు దూసుకెళ్లింది...

సెమీస్‌లో సింధు

తన్వీ శర్మ ఇంటికి

ఆస్ట్రేలియా ఓపెన్‌

సిడ్నీ: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ సెమీ్‌సకు దూసుకెళ్లింది. శుక్రవారం ముగిసిన క్వార్టర్స్‌లో సింధు 21-6, 21-9తో చెన్‌ సు యు (చైనీస్‌ తైపీ)పై సునాయాసంగా నెగ్గింది. సెమీ్‌సలో జపాన్‌ స్టార్‌ షట్లర్‌ యమగూచితో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర మ్యాచ్‌ల్లో 17 ఏళ్ల యువ సంచలనం తన్వీ శర్మ 14-21, 14-21తో యమగూచి చేతిలో ఓడింది. డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఎం.ఆర్‌.అర్జున్‌-హరిహరన్‌ జోడీ 19-21, 9-16తో చెన్‌ చెంగ్‌ కౌన్‌-హెంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇవి కూడా చదవండి:

సచిన్, కోహ్లీని వైభవ్ అధిగమిస్తాడు: డేల్ స్టెయిన్

అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు

Updated Date - Jun 13 , 2026 | 01:39 AM