అన్ సే చేతిలో పదో‘సారీ’
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:24 AM
పీవీ సింధు టైటిల్ వేటకు వరల్డ్ నెంబర్‌వన్ అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) అడ్డుగోడలా నిలుస్తోంది. తాజాగా...
ప్రీక్వార్టర్స్‌లో ఓడిన సింధు
ఇండోనేసియా ఓపెన్
జకార్త: పీవీ సింధు టైటిల్ వేటకు వరల్డ్ నెంబర్‌వన్ అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) అడ్డుగోడలా నిలుస్తోంది. తాజాగా గురువారం ఇండోనేసి యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లోనూ సింధు 17-21, 14-21 తేడాతో అన్ సే చేతిలోనే ఓడింది. ఇప్పటిదాకా తలపడిన పది మ్యాచ్‌ల్లోనూ సింధుపై అన్ సేదే పై చేయి. కాగా ఆయుష్ శెట్టి 21-16, 13-21, 14-21 తేడాతో చ్యూక్ యీ లీ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. అయితే డబుల్స్‌లో హరిహరన్-ఎంఆర్ అర్జున్ జోడీ 16-21, 21-15, 21-19 తేడాతో కాంగ్-తాయ్ (మలేసియా)ను ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించింది.
ఇవి కూడా చదవండి:
టెస్ట్ క్రికెట్ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ
సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త కెప్టెన్!