Share News

పీఎస్‌జీదే ‘చాంపియన్స్‌ లీగ్‌’

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:00 AM

చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మెయిన్‌ (పీఎస్‌జీ) నిలబెట్టుకొంది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో పీఎ్‌సజీ 1-1 (4-3)తో ఆర్సెనల్‌పై పెనాల్టీ షూటౌట్‌లో...

 పీఎస్‌జీదే ‘చాంపియన్స్‌ లీగ్‌’

  • వరుసగా రెండోసారి టైటిల్‌ కైవసం

  • ఫ్రాన్స్‌లో అభిమానుల అరాచకం

బుడాపెస్ట్‌: చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ పారిస్‌ సెయింట్‌ జెర్మెయిన్‌ (పీఎస్‌జీ) నిలబెట్టుకొంది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో పీఎ్‌సజీ 1-1 (4-3)తో ఆర్సెనల్‌పై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది. నిర్ణీత సమ యానికి ఇరుజట్లూ చెరో గోల్‌ చేయడంతో షూటౌట్‌ అనివార్యమైంది. షూటౌట్‌లో పీఎ్‌సజీ 4-3తో నెగ్గి వరుసగా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకొంది. అయితే, పీఎ్‌సజీ గెలిచిన తర్వాత భారీ సంఖ్యలో అభిమానులు ఫ్రాన్స్‌లో అల్లర్లకు పాల్పడ్డారు. వాహనాల హారన్లు మోగిస్తూ రచ్చ చేయడంతోపాటు షా పులను లూటీ చేశారు. ఈ హింసలో ఓ వ్యక్తి మృతి చెందగా, 8మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 57 మంది పోలీసులకు గాయాలు కాగా.. సుమారు 780 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:00 AM