ప్రజ్ఞానందకు షాక్
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:15 AM
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో జోరుమీదున్న భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు మూడో రౌండ్లో చుక్కెదురైంది...
మూడో రౌండ్లో ఓటమి
క్యాండిడేట్స్ చెస్
పీజియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో జోరుమీదున్న భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు మూడో రౌండ్లో చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో జవోకిర్ షిండరోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పాలయ్యాడు. తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 40 ఎత్తుల అనంతరం ఓటమిని అంగీకరించాడు. మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు వైశాలి, దివ్యా దేశ్‌ముఖ్ వరుసగా మూడో గేమ్‌నూ డ్రాగా ముగించారు. మూడో రౌండ్లో అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్)తో వైశాలి, అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా)తో దివ్య పాయింట్ పంచుకున్నారు. మూడో రౌండ్ అనంతరం ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతుండగా.. దివ్య, వైశాలి చెరో 1.5 పాయింట్లతో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత