టైటిల్‌కు అడుగు దూరంలో ప్రతీతి, మయాంక్
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:11 AM
ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారులు ప్రతీతి బోర్డోలోయ్, మయాంక్ చక్రవర్తి టైటిళ్లకి అడుగు దూరంలో నిలిచారు...
ఆసియా జూనియర్ చెస్
ముంబై: ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారులు ప్రతీతి బోర్డోలోయ్, మయాంక్ చక్రవర్తి టైటిళ్లకి అడుగు దూరంలో నిలిచారు. మంగళవారం జరిగిన బాలికల క్లాసికల్ 8వ రౌండ్‌లో విజయం సాధించిన ప్రతీతి, తెలుగమ్మాయి శ్రావ్యశ్రీతో తలపడిన 9వ రౌండ్‌ను డ్రాగా ముగించింది. ప్రస్తుతం ఏడు పాయింట్లతో ప్రతీతి అగ్రస్థానంలో ఉండగా, శ్రావ్యశ్రీ 6.5 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. క్లాసికల్ 9వ రౌండ్‌ను డ్రాగా ముగించిన మయాంక్ 7.5 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. తొమ్మిదో రౌండ్‌లో సిద్ధాంత్‌పై నెగ్గిన హైదరాబాద్ ఆటగాడు విఘ్నేష్ అద్వైత్ వేముల, ప్రస్తుతం 6.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. బుధవారం జరిగే ఆఖరి రౌండ్‌లో విజేత ఎవరో తేలనుంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!