విదేశీ కోచ్‌పై అంత మక్కువేల ?
ABN , Publish Date - May 14 , 2026 | 02:08 AM
కేవలం 17 నెలలకే జూనియర్ హాకీ జట్టు కోచ్ పదవి నుంచి తనను తప్పించడంపై మాజీ గోల్‌కీపర్ శ్రీజేష్ అసంతృప్తి వ్యక్తంచేశాడు. కొద్దికాలంలోనే కోచ్‌గా చక్కటి ఫలితాలు...
హాకీ ఇండియాను నిలదీసిన శ్రీజేష్
న్యూఢిల్లీ : కేవలం 17 నెలలకే జూనియర్ హాకీ జట్టు కోచ్ పదవి నుంచి తనను తప్పించడంపై మాజీ గోల్‌కీపర్ శ్రీజేష్ అసంతృప్తి వ్యక్తంచేశాడు. కొద్దికాలంలోనే కోచ్‌గా చక్కటి ఫలితాలు రాబట్టిన తన ను కాదని విదేశీయుడిపై హాకీ ఇండియా (హెచ్‌ఐ) మోజుపడడాన్ని నిలదీశాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు శ్రీజేష్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని హాకీ ఇండియా అదే ఏడాది ఆగస్టులో జూనియర్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించింది. శ్రీజేష్ పదవీకాలం గత డిసెంబరుతో ముగిసింది. అతడి ఆధ్వర్యంలో జూనియర్ జట్టు ఐదు టోర్నమెంట్లలో తలపడింది. అయిదింటిలోనూ పోడియం ఫినిష్ చేసింది. ఇందులో జూనియర్ ప్రపంచ కప్‌లో జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. అయితే శ్రీజేష్ ఒప్పందాన్ని పొడిగించని హాకీ ఇండియా కొత్త వ్యక్తిని నియమించేందుకు ప్రకటన జారీ చేసింది. దాంతో శ్రీజేష్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. కాగా. శ్రీజేష్‌ను ‘డెవల్‌పమెంట్ జట్టు’ కోచ్ బాధ్యతలు చేపట్టాలని కోరామని అందుకు అతడు నిరాకరించినట్టు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కే వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి..
ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు
ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా.