పాయల్‌కే పసిడి
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:30 AM
భారత టీనేజ్ పారా ఆర్చర్ పాయల్ నాగ్ అదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో...
ఫైనల్లో శీతల్‌పై విజయం
బ్యాంకాక్: భారత టీనేజ్ పారా ఆర్చర్ పాయల్ నాగ్ అదిరే ప్రదర్శనతో ఆకట్టుకుంది. ప్రపంచ పారా ఆర్చరీ ర్యాంకింగ్ సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో భారత్‌కే చెందిన స్టార్, ప్రపంచ నెంబర్‌వన్ శీతల్ దేవిని ఓడించి పసిడి పతకం పట్టేసింది. శనివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో 18 ఏళ్ల పాయల్ 139-136తో శీతల్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచింది. సీనియర్ స్థాయిలో శీతల్‌పై పాయల్ గెలవడం ఇది రెండోసారి. నిరుడు జనవరిలో జాతీయ చాంపియన్‌షి్‌పలో శీతల్‌ను పాయల్ ఓడించింది. ఇక, ప్రపంచ ర్యాంకింగ్ సిరీ్‌సలో పూర్తిగా భారత ఆర్చర్ల ఆధిపత్యం కొనసాగింది. ఈ టోర్నీలో ఏడు స్వర్ణాలు సహా మొత్తంగా 16 పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఇందులో నాలుగేసి రజతాలు, కాంస్యాలు ఉన్నాయి. వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రత్యర్థులుగా నిలిచిన పాయల్, శీతల్.. ముందురోజు టీమ్ ఈవెంట్‌లో కలిసి స్వర్ణం నెగ్గిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: