Share News

పారుల్‌ ‘రికార్డు’ పరుగు

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:57 AM

భారత స్టార్‌ అథ్లెట్‌ పారుల్‌ చౌధురి అంతర్జాతీయ వేదికపై రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో జరిగిన నికాయియా అథ్లెటిక్స్‌ మీట్‌లో...

పారుల్‌ ‘రికార్డు’ పరుగు

న్యూఢిల్లీ: భారత స్టార్‌ అథ్లెట్‌ పారుల్‌ చౌధురి అంతర్జాతీయ వేదికపై రికార్డు ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో జరిగిన నికాయియా అథ్లెటిక్స్‌ మీట్‌లో మహిళల 5 వేల మీటర్ల రేసును పారుల్‌ 15:04.26 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పారుల్‌ 15:10.35 సెకన్ల (మూడేళ్ల క్రితం)తో తనపేరిటే ఉన్న జాతీయ రికార్డును అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాదు.. ఈ ఏడాది ఆసియా క్రీడల కోసం జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య నిర్దేశించిన అర్హత టైమింగ్‌ (15:36.58 సె)ను కూడా దాటేసింది. ఇక.. ఇథియోపియాకు చెందిన బెరెకా సేనియా (15:03.85 సె) అగ్రస్థానంతో రేసు ముగించగా, ఫ్రాన్స్‌ అథ్లెట్‌ అలిసియా జార్బో (15:04.26 సె) మూడోస్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 05:57 AM