Share News

పారా అథ్లెట్‌ దారుణ హత్య

ABN , Publish Date - Jun 01 , 2026 | 03:08 AM

యూపీ పారా అథ్లెట్‌ చిరాగ్‌ త్యాగి (25) హత్యకు గురయ్యాడు. అతడి మిత్రుడు యశ్‌ ఖాతిక్‌..త్యాగిని కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్‌లో...

పారా అథ్లెట్‌ దారుణ హత్య

స్నేహితుడే హంతకుడు?

ఘజియాబాద్‌: యూపీ పారా అథ్లెట్‌ చిరాగ్‌ త్యాగి (25) హత్యకు గురయ్యాడు. అతడి మిత్రుడు యశ్‌ ఖాతిక్‌..త్యాగిని కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన జాతీయ పారా అథ్లెటిక్స్‌లో త్యాగి 400 మీ. రేస్‌లో స్వర్ణం సాధించాడు. బుధవారం ఇంటి వస్తున్నట్టు చెప్పిన త్యాగి.. ఎంతకీ రాకపోవడం, మొబైల్‌ స్విచ్చాఫ్‌ కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, శనివారం త్యాగి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి అనంతరం హంతకుడిగా భావిస్తున్న యశ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. గతంలో చిరాగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో యశ్‌పై అనర్హత వేటుపడింది. దీంతో పగపెంచుకొన్న ఖాతిక్‌ పథకం ప్రకారం త్యాగిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి పిస్తోలుతో కాల్చి చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్

ఐపీఎల్ ఫైనల్‌: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 03:08 AM