‘పాక్ లిఫ్టింగ్’ చీఫ్, కోచ్‌పై జీవితకాల నిషేధం
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:07 AM
డోపింగ్ కేసులో పాకిస్థాన్ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య చీఫ్ హఫీజ్ ఇమ్రాన్ భట్, కోచ్ ఇర్ఫాన్ భట్‌పై స్పోర్ట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యాంటీ డోపింగ్ డివిజన్...
లాసన్నే: డోపింగ్ కేసులో పాకిస్థాన్ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య చీఫ్ హఫీజ్ ఇమ్రాన్ భట్, కోచ్ ఇర్ఫాన్ భట్‌పై స్పోర్ట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యాంటీ డోపింగ్ డివిజన్ జీవితకాల నిషేధం విధించింది. 2014-16 మధ్య పాక్ అథ్లెట్లకు ఉద్దేశపూర్వకంగా వీరు నిషేధిత ఉత్ర్పేరకాలను ఇచ్చినట్టు కోర్టు నిర్ధారించింది. కాగా, డోపింగ్‌లో పట్టుబడి తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ దాఖలు చేసినందుకు వెయిట్ లిఫ్టర్ అబూబకర్ ఘనిపై నాలుగేళ్ల నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అరుదైన మైలురాయిని తాకిన అజింక్య రహానే
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు