లైంగిక వేధింపుల కేసు...
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:47 AM
లైంగిక వేధింపుల కేసులో ఒలింపియన్, ఆసియా క్రీడల పతక విజేత పీటీ పౌలోజ్‌ను భారత క్రీడా ప్రాధికార సంస్థ...
ఒలింపియన్ పౌలోజ్‌పై వేటు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో ఒలింపియన్, ఆసియా క్రీడల పతక విజేత పీటీ పౌలోజ్‌ను భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) సస్పెండ్ చేసింది. అలెప్పీలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో అతడు హైపెర్ఫామెన్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మహిళా రోయింగ్ కోచ్ గత జనవరిలో ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం పౌలోజ్‌పై వేటువేశారు. 2025 నుంచి పౌలోజ్ తనకు అసభ్యకర సందేశాలు పంపేవాడని, ఒంటరిగా ఉన్న సమయంలో తన గదిలోకి కూడా వచ్చాడని సదరు కోచ్ తన ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకొన్నట్టు సాయ్ వర్గాలు తెలిపాయి. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత రోయర్‌గా పౌలోజ్ నిలిచాడు. 2004 విశ్వక్రీడల్లో పురుషుల సింగిల్ స్కల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన నలుగురు సభ్యుల బృందంలో పౌలోజ్ ఒకడు.
ఇవి కూడా చదవండి:
అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు
మూడేళ్ల నాటి సెహ్వాగ్ సవాల్.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!