నార్వే చెస్ బరిలో హంపి
ABN , Publish Date - May 25 , 2026 | 04:30 AM
ప్రఖ్యాత నార్వే చెస్ పోటీల్లో కోనేరు హంపితో పాటు గుకేష్, ప్రజ్ఞానంద బరిలోకి దిగుతున్నారు. సోమవారం ప్రారంభమయ్యే...
ఓస్లో (నార్వే): ప్రఖ్యాత నార్వే చెస్ పోటీల్లో కోనేరు హంపితో పాటు గుకేష్, ప్రజ్ఞానంద బరిలోకి దిగుతున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ఈ టోర్నీ జూన్ ఐదో తేదీ వరకు జరగనుంది. పురుషుల కేటగిరీలో గుకేష్, ప్రజ్ఞానందతో పాటు మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే), అలీరెజా (ఫ్రాన్స్), కీమెర్ (జర్మనీ) వెస్లీ సో (అమెరికా) పోటీ పడనున్నారు. మహిళల విభాగంలో హంపి, దివ్యా దేశ్‌ముఖ్‌తో పాటు జు వెన్‌జున్ (చైనా), డిఫెండింగ్ నార్వే చాంపియన్ అన్నా ముజిచుక్ (ఉక్రెయిన్), వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అసౌబయేవా (కిజికిస్థాన్), జు జిన్నెర్ (చైనా) టైటిల్ కోసం బరిలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..