Share News

శరణార్థి శిబిరంలో జన్మించి..

ABN , Publish Date - Jun 15 , 2026 | 05:55 AM

మెరుపు వేగంతో కదులుతూ.. టర్కీ డిఫెన్స్‌ ఛేదించుకుంటూ ఆస్ట్రేలియా ఆటగాడు నెస్టోరి ఈరాన్‌కుండా చేసిన సోలో గోల్‌ మ్యాచ్‌కే హైలైట్‌...

శరణార్థి శిబిరంలో జన్మించి..

మెరుపు వేగంతో కదులుతూ.. టర్కీ డిఫెన్స్‌ ఛేదించుకుంటూ ఆస్ట్రేలియా ఆటగాడు నెస్టోరి ఈరాన్‌కుండా చేసిన సోలో గోల్‌ మ్యాచ్‌కే హైలైట్‌. దీంతో 20 ఏళ్ల నెస్టోరి వరల్డ్‌క్‌పలో ఆసీస్‌ తరఫున గోల్‌ చేసిన పిన్నవయస్కుడిగా రికార్డులకెక్కాడు. బురుండీలో అంతర్గత యుద్ధం, అనిశ్చితి కారణంగా నెస్టోరి తల్లిదండ్రులు ఆ దేశాన్ని వీడి టాంజానియాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకొన్నారు. ఈ శిబిరంలోనే నెస్టోరి జన్మించాడు. ఆ తర్వాత అతడి కుటుంబం అడిలైడ్‌లో ఆశ్రయం పొందింది. ఇక్కడే ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ ఆరంభించిన నెస్టోరి చిన్నవయసులోనే తన ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. 15 ఏళ్ల వయసులోనే స్థానిక అడిలైడ్‌ యునైటెడ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 05:55 AM