Share News

నీరజ్‌ X పథిరగే

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:23 AM

ప్రపంచ అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ త్రో పోటీ అంటే భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా-శ్రీలంక యువ అథ్లెట్‌ రుమేశ్‌ పథిరగే అన్నట్టుగా మారింది. ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో వారిద్దరి పోటీ అలానే జరిగింది...

నీరజ్‌ X పథిరగే

నేడు లుజాన్‌ డైమండ్‌ లీగ్‌

రా. 11.52 నుంచి

లుజాన్‌: ప్రపంచ అథ్లెటిక్స్‌లో జావెలిన్‌ త్రో పోటీ అంటే భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా-శ్రీలంక యువ అథ్లెట్‌ రుమేశ్‌ పథిరగే అన్నట్టుగా మారింది. ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో వారిద్దరి పోటీ అలానే జరిగింది. తాజాగా..నీరజ్‌-పథిరగే మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం లుజాన్‌ డైమండ్‌ లీగ్‌ జరగనుంది. ఇందులో చోప్రా-రుమేశ్‌ మధ్య పోరు మరోసారి ఆసక్తి రేపుతోంది. బ్రస్సెల్‌లో డైమండ్‌ లీగ్‌ గ్రాండ్‌ ఫైనల్‌లో చోటుకు లుజానె పోటీ నీరజ్‌కు కీలకం కానుంది. ప్రస్తుత డైమండ్‌ లీగ్‌ సీజన్‌లో ఆరు పాయింట్లతో నీరజ్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్‌-6లో ఉన్న వారే వచ్చే నెల 4-5 తేదీల్లో జరిగే బ్రస్సెల్స్‌ లీగ్‌ గ్రాండ్‌ ఫైనల్లో తలపడేందుకు అర్హత సాధిస్తారు. పథిరగే, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా) ఇప్పటికే బ్రస్సెల్స్‌ ఫైనల్స్‌ క్వాలిఫై అయ్యారు. లుజాన్‌ కాక ఈనెల 27న జ్యూరిచ్‌ డైమండ్‌ లీగ్‌ జరగనుంది. ఇదిలావుండగా 23 ఏళ్ల శ్రీలంక త్రోయర్‌ పథిరగే ఈ సీజన్‌లో తలపడిన తొమ్మిది పోటీలలో ఏకంగా ఎనిమిదింటిలో గెలుపొందాడు. మరోవైపు వెన్ను గాయం నుంచి కోలుకొన్న నీరజ్‌కు ఈ సీజన్‌ పునరాగమనంగా మారింది. ఆ గాయం నుంచి కోలుకొని దోహా డైమండ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు. అయితే 28 ఏళ్ల నీరజ్‌ 100 శాతం ఫిట్‌గా లేడని గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో అతడి ప్రదర్శన చూస్తే అర్థమైంది.

.పోటీ తీవ్రమే..

ఈ లుజాన్‌ లీగ్‌నుంచి ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ (పాకిస్థాన్‌), యూరోపియన్‌ విజేత జులియన్‌ వెబర్‌ (జర్మనీ) వైదొలగినా..పోటీ తీవ్రంగానే ఉండనుంది. వరల్డ్‌ చాంపియన్‌ వాల్కాట్‌ (ట్రినిడాడ్‌-టుబాగో), రెండుసార్లు ప్రపంచ విజేత అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనడా), ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన కుర్టిస్‌ థాంప్సన్‌ (అమెరికా), టోక్యో ఒలింపిక్స్‌లో రజత విజేత జాకబ్‌ వాడ్లేచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) ఇక్కడ పోటీపడుతుండడమే దీనికి కారణం.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:23 AM